‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం పాత్ర ఎలా ఉంటుందో తెలుసా

‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం పాత్ర ఎలా ఉంటుందో తెలుసా

Published on Nov 24, 2019 10:06 AM IST

brahmanandam1

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ త్వరలో ‘రంగమార్తాండ’ చిత్రాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతుండగా కృష్ణవంశీ నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. ప్రధాన పాత్రదారులుగా రమ్యకృష్ణ, ప్రకాష రాజ్ లను తీసుకున్న ఆయన ఇంకో ముఖ్యమైన రోల్ కోసం సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందంను ఎంచుకున్నారు.

ఈ సినిమాలో బ్రహ్మానందంగారి పాత్ర కేవలం హాస్యానికి పరిమితమయ్యే పాత్ర కాదట. ఆయనది చాలా ఎమోషన్ కలిగిన రోల్ అని, గుండెని మెలిపెట్టే భావోద్వేగాలు అందులో ఉంటాయని అంటున్నారు కృష్ణవంశీ. త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు