బాలయ్య ఆరోగ్యంపై బ్రాహ్మణి అప్డేట్..!

Nandamuri-Balakrishna

నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు ధన్యవాదాలు తెలిపిన ఆమె, తన తండ్రి ఇప్పటికే మళ్లీ ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌గా మారారని, త్వరలోనే రీ-ఎంట్రీ ఇస్తారని స్పష్టం చేశారు.

రాజమండ్రిలో ‘NBK111’ షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా బాలకృష్ణ గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం మోకాలి సర్జరీ మూడు గంటలకు పైగా సాగింది.

ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా సర్జరీ పూర్తికావడంతో పాటు, బ్రాహ్మణి ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యుల సలహా మేరకు పూర్తిగా కోలుకున్న తర్వాత బాలకృష్ణ మళ్లీ ‘NBK111’ షూటింగ్‌లో పాల్గొంటాడు.

Exit mobile version