బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ మల్టీస్టారర్ చిత్రమే “వార్ 2”. నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న స్పై యూనివర్స్ లో సినిమా ఇది కాగా గట్టి అంచనాలు ఈ సినిమాపై కూడా ఉన్నాయి.
అయితే ఈ చిత్రం టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా ఇందులో ఎక్కువగా ఒక్క అంశం మీదనే ఆడియెన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అదేమిటంటే ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఇంకా సీజీ పనులు కోసమే. అయితే ఇదే దర్శకుడు అయాన్ ముఖర్జీ నుంచి స్టన్నింగ్ విజువల్ వండర్ “బ్రహ్మాస్త్ర” వచ్చింది.
దీనితో వార్ 2 విజువల్స్ కూడా అంతే రీతిలో అదిరిపోతాయ్ అని చాలా మంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అవే ఇపుడు వీక్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సినిమాకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో వాటిని బెటర్ చేస్తారేమో చూడాలి మరి.