‘మూడడుగుల బులెట్’ గా బ్రహ్మానందం

‘మూడడుగుల బులెట్’ గా బ్రహ్మానందం

Published on May 13, 2014 12:45 PM IST

brahmanandam
తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒకరు. ఈయన ప్రతి సినిమాలో కాసేపు కనపడినా ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకుంటారు. అలాంటిది ఒక సినిమాలో తనే హీరో అయితే ఏ రేంజ్ లో కామెడీ ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. అలా బ్రహ్మానందం హీరోగా చేస్తున్న ఓ సినిమాకి ‘మూడడుగుల బుల్లెట్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బాగా ఫేమస్ అయిన పాత లిరిక్ ‘ఆరడుగుల బుల్లెట్’ ఈ పేరుని బ్రహ్మానందంకి తగ్గట్టుగా మార్చి ‘మూడడుగుల బుల్లెట్’ అని టైటిల్ పెట్టారు. సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ద్వారా ఓ రచయిత దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా ఆధ్యంతం కామెడీగా ఉంటుందని సమాచారం.

తాజా వార్తలు