అరవింద సమేతలో తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్న ప్రముఖ నటుడు !

Published on Sep 18, 2018 12:02 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈచిత్రాన్నిఎలాగైనా అక్టోబర్ 11న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక ఈచిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మజీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈసినిమాలో తన పాత్రకు ఆయన డబ్బింగ్ చెప్పుతున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మజీ రాయలసీమ యాసలో మాట్లాడనున్నారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం యొక్క ఆడియో ఈనెల 20న నేరుగా మార్కెట్లోకి విడుదలకానుంది. ఇక ఈచిత్రానికి సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అక్టోబర్ మొదటి వారంలో గ్రాండ్ గా జరుగనుంది.

సంబంధిత సమాచారం :

X
More