
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రేపు (మే 31న) సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లాంచ్ కానుంది. ఇక రేపట్నుంచే అధికారికంగా షూటీంగ్ కూడా ప్రారంభం కానుండడం విశేషం.
విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయవాడ పరిసర ప్రాంతాలను ఇంతకుముందెన్నడూ చూపించనంత అందంగా చూపించాడానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఇప్పటికే సన్నాహాలు చేసుకున్నారు. ఇక ఇవ్వాళ విడుదల చేసిన ‘బ్రహ్మోత్సవం’ లోగోలో తెలుగుదనంతో పాటు, టైటిల్ హుందాతనం ఉట్టిపడుతోంది. పేరుకు తగ్గట్టుగానే లోగోలో బ్రహ్మోత్సవ కళ వెలిగిపోతోంది. ఇక మహేష్ కెరీర్లో ఇది మరో మరిచిపోలేని సినిమాగా నిలుస్తుందని శ్రీకాంత్ అడ్డాల మొదట్నుంచీ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. రేపు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.

