
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలయికలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘బ్రహ్మోత్సవం’. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మిక్కి జె మేయర్ స్వరాలు సమకూరుస్తారు. మే నెలలో లాంచనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం.
ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని సమాచారం. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటుల కోసం కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘బ్రహ్మోత్సవం’ స్టార్ట్ చేశారు. మే నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

