ఊటీకి షిఫ్ట్ అయిన ‘బ్రహ్మోత్సవం’!

ఊటీకి షిఫ్ట్ అయిన ‘బ్రహ్మోత్సవం’!

Published on Dec 8, 2015 11:37 PM IST

Bramothsam
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం’ అనే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం, బ్లాక్‌బస్టర్ హిట్ ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ చేస్తోన్న సినిమా కావడం లాంటి విషయాల వల్ల బ్రహ్మోత్సవం సినిమా సెట్స్‌పైకి వెళ్ళినరోజునుంచే విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పీవీపీ సినిమా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇక ఈమధ్యే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పదిరోజుల షెడ్యూల్‌ను మొదలుపెట్టిన టీమ్ ఇవాళ్టితో ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఇక ఈ షెడ్యూల్ పూర్తైందో లేదో వెంటనే ఊటీలో జరగనున్న మరో షెడ్యూల్ కోసం బ్రహ్మోత్సవం టీమ్ ఊటీ బయలుదేరింది. డిసెంబర్ 10న మొదలయ్యే ఈ షెడ్యూల్ ఈ నెలాఖర్ వరకూ కొనసాగుతోంది. సమంత, కాజల్, ప్రణీత ఇలా ముగ్గురు హీరోయిన్లతో పాటు భారీ తారాగణం నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో వేసవి సీజన్‌కు విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు