ఆ శృంగారతార హీరోయిన్గా బ్రహ్మానందం,సునీల్ బాలీవుడ్ ఎంట్రీ

Published on Jun 12, 2019 8:07 am IST

తెలుగులో టాప్ కమెడియన్ బ్రహ్మానందం, హీరో సునీల్ బాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ఓ మూవీకి ఈ ఇద్దరు నటులు తమ ఆమోదాన్ని తెలుపుతూ అగ్రిమెంట్ పై సంతకాలు కూడా చేశారట. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో శృంగారతార సన్నీలియోన్ హీరోయిన్ గా చేస్తుందట. బాలీవుడ్ లో కామెడీ హారర్ మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. గతంలో ఈ జోనర్లో వచ్చిన చిత్రాలు అక్కడ విజయం సాధించాయి. ఈ మూవీకి ప్రసాద్ తాతినేని దర్శకత్వం వహిస్తుండగా, పేరు ఇంకా నిర్ణయించాల్సిఉంది.

బ్రహ్మానందం అనారోగ్యరీత్యా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తిరిగి మరలా కోలుకోవడంతో మళ్ళీ ఆయన సినిమాలపై దృష్టిసారించారు. ఇటీవల ఎస్ వి రంగా రావు నటప్రస్థానంపై రాసిన “మహానటుడు” పుస్తకావిష్కరణ వేదికపై ఆయన సందడి చేశారు.ఇక సునీల్ హీరో గా కంటే కమెడియన్ గానే బెటర్ అని ఫుల్ టైం కమెడియన్ గా మారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ఇద్దరు లెజెండరీ తెలుగు కమెడియన్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More