ఆగష్టు 3న ‘బ్రాండ్ బాబు’ గ్రాండ్ ఎంట్రీ !

Published on Jul 24, 2018 9:55 am IST

సుమంత్ శైలేంద్ర హీరోగా, యాంకర్ ప్రభాకర్ దర్శకత్వంలో ‘బ్రాండ్ బాబు’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఇక ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర సరసన ఈషా రెబ్బా కథానాయకిగా నటిస్తోంది. ప్రముఖ నటుడు ముర‌ళీశ‌ర్మ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శైలేంద్రబాబు మాట్లాడుతూ ‘దర్శకుడు మారుతి చక్కటి స్క్రిప్ట్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 30వ తేదీన ఆడియో ఫంక్షన్ ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

జే.బీ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ పళని కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యస్ శైలేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ చిత్రం మారుతి చిత్రాల శైలిలోనే సాగుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం.

సంబంధిత సమాచారం :