సినీ మార్కెట్లోకి సరికొత్త నిర్మాణ సంస్థ “ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్”

సినీ మార్కెట్లోకి సరికొత్త నిర్మాణ సంస్థ “ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్”

Published on Oct 24, 2020 5:02 PM IST

ఒక సినిమాను చెయ్యాలన్నా దానిని కొనాలి అన్నా నిర్మాణ సంస్థలు మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఎంతో కీలకం. మన టాలీవుడ్ లో ఎన్నో నిర్మాణ సంస్థలు మరియు మరెంత మందో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అలా ఈ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మన మార్కెట్ లోకి సరికొత్త నిర్మాణ మరియు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ పరిచయం అయ్యేందుకు రెడీగా ఉంది.ఈ సందర్భంగా వారు తమ స్పందనను తెలుపుతూ..

మా నిర్మాణ మరియ పంపిణీ సంస్థ ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ను మీ అందరికీ పరిచయం చేసుకుంటుండడం మాకు చాలా సంతోషంగా ఉంది.’ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ భారతీయ మూలాలు కలిగిన నిర్మాణ సంస్థ మరియు… ప్రధాన భారతీయ చిత్రాలను… ముఖ్యంగా తెలుగు చిత్రాలను విదేశాల్లో పంపిణీ చేసే ఒక నమ్మకమైన డిస్ట్రిబ్యూషన్ సంస్థ.అమెరికాలోని ‘మియామి’లో ప్రధాన కార్యాలయం కలిగిన ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’కు..ఇండియాలోని హైదరాబాద్ లో ప్రాంతీయ కార్యాలయం కలదు.

కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్, డ్రామా, యాక్షన్, హారర్, థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్ల చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలన్నది ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ స్థిర సంకల్పం.అత్యంత సునాయాసంగా ప్రజల హృదయాలను హత్తుకుపోగల అనన్య సామాన్య శక్తి ‘సినిమా’ అనే మాధ్యమానికి ఉందనే సార్వజనీక సత్యాన్ని మేము కూడా ప్రగాఢంగా విశ్వసిస్తాం. ఒక జీవితకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోయే రస స్ఫూర్తిని సినిమా రగిలించగలదని మేము బలంగా నమ్ముతాం.

అందుకే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయగల సినిమాలకు రూపకల్పన చేయగల అసాధారణ ప్రతిభావంతులకు ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ ఎర్ర తివాచీ పరుస్తూ… సాదర స్వాగతం పలుకుతోంది.రాజీ ఎరుగని నిబద్ధత, అంకితభావం… అచంచలమైన ఆత్మ విశ్వాసం, కఠినతర క్రమశిక్షణ, పటిష్టమైన ప్రణాళిక, సానుకూల దృక్పధంతో… సమీప భవిష్యత్తులో తెలుగులో ‘అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ’ గా అందరి మన్ననలు అందుకోవాలనే సమున్నత ఆశయం కలిగిన “ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్”
మీ అందరి ఆశీస్సులు సవినయంగా వేడుకుంటోంది! అని వారు విన్నవించుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు