బ్రేకింగ్ – రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్.!

Published on Apr 17, 2021 1:46 pm IST

మళ్ళీ కరోనా ప్రపంచాన్ని కమ్మేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడిన సంగతి మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని రోజులు కితం వరకు పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలకు తాకినా కరోనా ప్రభావం నిన్ననే మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్ రావడం షాక్ ఇచ్చింది.

మరి ఈరోజు రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్ రావడం బాధాకరం. గత ఏడాది కరోనా కష్ట కాలంలో సోనూ సూద్ దేశ వ్యాప్తంగా నలుమూలల ప్రజలకు ఎలాంటి సాయం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా సోనూ సూద్ తన వంతు సహకారం ఆపకుండా చేస్తూ వస్తున్నారు.

మరి అలాంటి సోనూ సూద్ కు కోవిడ్ పాజిటివ్ రావడం బాధాకరం. ఆల్రెడీ స్వీయ క్వారంటైన్ లో ఉన్న సోనూ సూద్ ఎవరూ ఆందోళన పడొద్దని ఇప్పుడు కూడా ప్రతీ ఒక్కరి సమస్య పరిష్కరిస్తానని నేను ఉన్నదే మీకోసం అని ఈ సమయంలో కూడా సోనూ సూద్ తెలిపాడు. మరి ఎందరికో ఆధారంగా నిలిచిన సోనూ సూద్ త్వరగా కోలుకోవాలని మనం కూడా ప్రార్ధిద్దాం.

సంబంధిత సమాచారం :