వినూత్నంగా ఉన్న ‘బ్రోచేవారెవరురా’ టైటిల్ లుక్ పోస్టర్ !

Published on Dec 31, 2018 10:51 am IST

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. కాగా ఈ చిత్రం యొక్క టైటిల్ లుక్ పోస్టర్ ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల అయింది. టైటిల్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. చాలా వినూత్నంగా ఉంది. సినిమా పై నెటిజన్లలో ఆసక్తి పెంచుతుంది ఈ పోస్టర్.

మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే తెరకెక్కించనున్నాడు. ప్రధానంగా క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నివేత థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వివేక్ సాగర్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :