ఈవివి సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అల్లరి నరేష్ – మోనాల్ గజ్జర్ జంటగా అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్న సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’. అల్లరి నరేష్ అమాయకుడి పాత్రలో నటించగా, అతని సోదరిగా బొమ్మాళి తరహా పాత్రలో ట్విన్ సిస్టర్ గా కార్తీక నటించింది. ‘వీడు తేడా’ ఫేం చిన్ని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాను నవంబర్ 7న విడుదల చేస్తున్నట్టు గతంలో నిర్మాతలు ప్రకటించారు. మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.
సిస్టర్ సెంటిమెంట్ తో పాటు హిలేరియస్ కామెడీని మిక్స్ చేసి తెరకెక్కించారు. నరేష్ నటన, డూప్ సహాయం లేకుండా కార్తీక చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇటివల విడుదలైన ఆడియో, ట్రైలర్ లకు అద్బుత స్పందన లభిస్తుంది. విడుదలకు ముందే ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు 4 కోట్ల రూపాయల ఫ్యాన్సీ రేటు చెల్లించి జీ తెలుగు చేజిక్కించుకుంది.


