
యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. ఈ టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాలో కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం వరుసగా సాంగ్స్ షూటింగ్ ని ఫినిష్ చేస్తోంది. ఇటీవలే లే చలో సాంగ్ షూట్ ని ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాల్ లో ఓ డ్రామా సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సాంగ్ షూట్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.
ఈ సాంగ్ షూట్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం మెగాస్టార్ చిరంజీవి పై వచ్చే సీన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్ ని మూడు రోజుల పాటు షూట్ చేయనున్నారు. దానికి సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు రిలీజ్ కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ ని అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేసి, దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమాని రిలీజ్ చేయనున్నారు.

