బుచ్చిబాబు రూట్ మార్చారా ?

Published on Jun 9, 2021 8:03 pm IST

ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ చూసిన విజయాల్లో ‘ఉప్పెన’ కూడ ఒకటి. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకోవడంతో బుచ్చిబాబుకు స్టార్ హీరోల వద్దకు యాక్సెస్ దొరికింది. దీంతో ఎన్నాళ్లగానో అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అయ్యారు బుచ్చిబాబు. స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నారు. అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్న్ అయింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్ ఆతర్వాత కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తవగానే తన సినిమా ఉంటుందని బుచ్చిబాబు అనుకున్నారు.

కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నారు ఎన్టీఆర్. కొన్ని నెలలుగా చర్చల దశలోనే ఉన్న ఈ సినిమా ఇటీవలే ఓకే అయింది. కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఫిక్స్ అయింది. బుచ్చిబాబు ఎదురుచూడాల్సిన టైమ్ పెరిగింది. 2022 ఆఖరుకు కానీ ఎన్టీఆర్ డేట్స్ దొరకవు. అందుకే బుచ్చిబాబు ప్లాన్స్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఈ లాంగ్ గ్యాప్లో ఒక సినిమా చేసేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అందుకే వేరే హీరోకు కథ రెడీ చేసుకుంటున్నారని, చర్చలు కూడ జరుగుతున్నాయని టాక్. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే బుచ్చిబాబు నుండి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :