మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ “చికిరి చికిరి” ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సింగిల్‌పై పడింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రాబోయే రెండో పాట ఒక పవర్‌ఫుల్ ‘ఇంట్రడక్షన్ సాంగ్’ అని, దీనికి జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేశారని సమాచారం.
దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ పాట గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇది ఖచ్చితంగా ఒక “బ్లాస్ట్” లా ఉంటుందని అభిమానులకు ప్రామిస్ చేశారు. నిజానికి ఈ పాట డిసెంబర్ నెలాఖరులోనే రావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడు దానిని ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉండటంతో మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


