ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు లోకల్ స్టోరీ

Published on May 21, 2021 3:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినిమాలు చేయాల్సిన దర్శకులంతా తమ ప్రాజెక్ట్ విశేషాలను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. వారిలో ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన కూడ ఉన్నారు. బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ కూడ లాక్ అయినట్టు తెలుస్తోంది. వీరి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కొందరేమో వీరి చిత్రం ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని, అందులో తారక్ వయసు మళ్ళిన పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. కానీ ఏ విషయమూ పక్కాగా బయటకు రాలేదు.

ఇదిలా ఉంటే బుచ్చిబాబు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు. ‘లోకల్ కథను ప్రపంచస్థాయిలో చెప్పి ట్రెండ్ సృష్టిద్దాం. అందుకోసం ఎదురుచూస్తున్నాను సర్’ అన్నారు. బుచ్చిబాబు మాటలను బట్టి సినిమాలో ఏదో పెద్ద విశేషమే దాగి ఉందని అనిపిస్తోంది. మరి ఆ విశేషం ఏమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఇకపోతే తారక్ నెక్స్ట్ కొరటాల శివతో ఆతర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. వీటి తర్వాత బుచ్చిబాబు సినిమా ఉండొచ్చు.

సంబంధిత సమాచారం :