“పుష్ప2” స్క్రిప్ట్ వర్క్ లో సుకుమార్ తో బుచ్చిబాబు!

Published on Jul 27, 2022 4:38 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం పార్ట్ 2 అయిన పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం స్క్రిప్ట్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు.

అయితే మొదటి పార్ట్ కి వచ్చిన సూపర్ క్రేజ్ కారణం గా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్. ఇప్పటికే కొత్త రచయితల సహాయం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో తొలి చిత్రం తోనే సూపర్ హిట్ సాధించిన ఉప్పెన ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సన సుకుమార్ తో పుష్ప 2 కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలాకాలం గా సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా చేసిన బుచ్చిబాబు, ఉప్పెన చిత్రం తో ఫుల్ టైం డైరెక్టర్ గా మారడమే కాకుండా, క్రేజీ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అయితే తాజాగా సుకుమార్ తో బుచ్చిబాబు పుష్ప 2 కోసం పని చేస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, ధనంజయ, ఫాహద్ ఫజిల్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :