వరుస ప్లాప్ లకు.. 14 కోట్లు.. !

Published on Feb 27, 2019 6:05 pm IST

ఇండస్ట్రీలోకి హిట్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం గత ఆరు సినిమాల నుంచి వరుసగా ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎప్పుడో 2015లో వ‌చ్చిన ‘సుప్రీమ్’ త‌ర్వాత తేజ్ నటించిన ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు’ ఇలా సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌లే. దాంతో తేజు మార్కెట్ బాగా పడిపోయింది. ప్రస్తుతం చేస్తోన్న ‘చిత్రల‌హరి’ ఫలితం బట్టే.. బాక్సాఫీస్ వద్ద ‘సాయి ధరమ్ తేజ్’ రేంజ్ కూడా ఆధారపడి ఉంటుంది.

కాగా ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ‘చిత్రలహరి’ పైనే బాగానే అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ బడ్జెట్ విషయంలో మాత్రం బాగానే కోతలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు 20 కోట్ల బడ్జెట్ అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మార్కెట్ దృష్ట్యా 15 నుంచి 16కోట్ల వరకు అయితే సేఫ్ ప్రాజెక్ట్ అని భావించిన నిర్మాతలు అంతే బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

కాగా తాజా సమాచారం ప్రకారం 16 కోట్లు కూడా కాకుండా 14 కోట్లలోనే సినిమాని పూర్తి చేసేలా కనిపిస్తున్నారట నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది చిత్రలహరి. మొత్తానికి సాయి ధరమ్ ప్లాప్ ల ప్రభావం ‘చిత్రలహరి’ ఫైన బాగానే పడింది. ఏమైనా చాలా కాలం నుంచి హిట్లు లేక డీలా పడిన ఈ మెగా మేనల్లుడుకి ‘చిత్రలహరి’ చాలా కీలకం కానుంది.

ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సునీల్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :