కృతీ సనన్‌కు బంపర్ ఆఫర్!

కృతీ సనన్‌కు బంపర్ ఆఫర్!

Published on Jun 25, 2015 8:26 PM IST

Kriti-sanan
‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కృతి సనన్.. తన మొదటి సినిమాతోనే అందం, నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్టు కృతీ సనన్‌కి మంచి క్రే‌జ్‌ను మాత్రమే కాక అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో ఓ భారీ ఆఫర్ తెచ్చిపెట్టినత్లు సమాచారం.
ఓ ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ సంస్థ తమ బ్రాండ్‌కు దేశవ్యాప్త అంబాసిడర్‌గా కృతీ సనన్‌ను సంప్రదించిందట.

తమ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు గానూ ఆ సంస్థ కృతీ సనన్‌కు కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలవ్వగా అప్పుడే ఓ పెద్ద బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాల్సి రావడం, కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేయడంతో కృతీ సనన్ ఆనందానికి అవధుల్లేవని సమాచారం. కృతీ సనన్ గతంలో చాలా యాడ్‌‌లకు మోడల్‌గా పనిచేయగా ఇప్పుడు ఏకంగా ఓ పెద్ద బ్రాండ్‌కు అంబాసిడర్‌‌గా పనిచేసే అవకాశం సొంతం చేసుకోవడం విశేషమే!

తాజా వార్తలు