బంపర్ ప్రైజ్ పలికిన బన్ని మూవీ సీడెడ్ రైట్స్

బంపర్ ప్రైజ్ పలికిన బన్ని మూవీ సీడెడ్ రైట్స్

Published on Dec 3, 2015 1:35 PM IST

allu-arjun
‘రేసు గుర్రం’, ‘S/O సత్యమూర్తి’ సినిమాలతో రెండు 50 కోట్ల మార్క్ సినిమాలను సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. సరైనోడు అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. జులాయి సినిమా నుంచి అల్లు అర్జున్ సినిమాల మార్కెట్ రేజ్ భారీగా పెరిగింది. అందుకే బన్ని సినిమాలకి రిలీజ్ కి ముందే భారీ రేటుకి అన్ని ఏరియాల రైట్స్ అమ్ముడు పోతుంటాయి.

అదే విధంగానే తాజాగా ‘సరైనోడు’ సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన ఎన్వి ప్రసాద్ ఈ సినిమా సీడెడ్ రైట్స్ ని సుమారు 8 కోట్లకి పైనే ఖర్చు పెట్టి కొనుగోలు చేసారు. అల్లు అర్జున్ ‘S/O సత్యమూర్తి’ సినిమా సీడెడ్ లో సుమారు 7 కోట్లకి అమ్మారు. కానీ ఈ సినిమా మాస్ లో భారీ ఫాలోయింగ్ బోయపాటి శ్రీను మార్క్ కూడా తోడవడంతో సీడెడ్ లో ఈ సినిమా బాగా ఆడుతుందని భావించి ఈ చిత్ర టీం ఈ రేటుకి సీడెడ్ రైట్స్ ని అమ్ముడు చేసారు. ఈ ఒక్క ఏరియాలోనే కాదు మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమాకి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

అల్లు అర్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనుంటే, శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు