ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ కన్ఫర్మ్ !

ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ కన్ఫర్మ్ !

Published on Nov 11, 2018 4:26 PM IST

నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోయే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జేఆర్సి ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

కాగా అల్లు అర్జున్ ‘గీత గోవిందం’ చిత్రం ఆడియో వేడుకకు కూడా ముఖ్య అతిధిగా వచ్చారు. ఆ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది. అలాగే ఇప్పుడు ఈ టాక్సీవాలాకు కూడా వస్తున్నాడు. మరి ఆ సెంటిమెంట్ ఏమైనా వర్క్ ఔట్ అవుతుందేమో చూడాలి.

కాగా టాక్సీవాలా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. ఈ చిత్రం ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు