బన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది !

Published on Jul 25, 2018 11:15 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు వస్తోన్న వ్యూస్ ఇతర ఏ స్టార్ హీరోకు రావంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇటీవలే బన్ని సరైనోడు చిత్రం హిందీలో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో బన్ని కుటుంబానికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది.

తాజాగా బన్ని సతీమణి స్నేహ రెడ్డి తమ కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటో బన్ని అభిమానులతో పాటు, నెటిజన్లను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. పింక్ కలర్ పట్టులంగాలో అర్హ క్యూట్‌గా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటే, అయాన్ చిన్న స్మైల్ తో ఆకట్టుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :