మెగాస్టార్ ‘సైరా’లో బన్నీ ‘రుద్రమదేవి’ మాడ్యులేషన్ !

మెగాస్టార్ ‘సైరా’లో బన్నీ ‘రుద్రమదేవి’ మాడ్యులేషన్ !

Published on Mar 19, 2019 11:56 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తుదిదశలో ఉంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఓ కీలక పాత్రలో అల్లు అర్జున్ కూడా నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వస్తున్నాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ ఎలాంటి కీలక పాత్రలో నటించట్లేదు. కాకపోతే సినిమాలోని కొన్ని కీలక ఘట్టాలు బన్నీ వాయిస్ ఓవర్ తోనే మొదలవుతాయట. బన్నీ ‘రుద్రమదేవి’ సినిమాలో చెప్పిన మాడ్యులేషన్ శైలిలోనే సైరాలో బన్నీ వాయిస్ ఓవర్ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు