‘గంగోత్రి’ టు ‘అల’ వరకు బన్నీ జర్నీ ఒక ఫ్రేమ్ లో..!

Published on Feb 5, 2020 11:14 am IST

అల వైకుంఠపురంలో మూవీ భారీ విజయం సాధించడంతో బన్నీ టాలీవుడ్ డైరెక్టర్స్ అందరికి తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఒకరిద్దరు మినహా టాలీవుడ్ ప్రముఖ దర్శకులందరూ ఈ పార్టీకి హాజరయ్యారు. ముఖ్యంగా బన్నీతో చిత్రాలు చేసిన దర్శకులలో చాలా మంది ఈ పార్టీకి హాజరయ్యారు. ఐతే బన్నీని వెండితెరకు హీరోగా పరిచయం చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పార్టీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గంగోత్రి సినిమా ద్వారా రాఘవేంద్ర రావు బన్నీని హీరోగా పరిచయం చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో బన్నీ… రాఘవేంద్ర రావు మరియు త్రివిక్రమ్ తో కలిసి దిగిన ఫోటో స్పెషల్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. గంగోత్రి నుండి అల వైకుంఠపురంలో వరకు నా సినిమా జర్నీ అని ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. త్రివిక్రమ్ కూడా బన్నీ కెరీర్ లో స్పెషల్ డైరెక్టర్. లేటెస్ట్ గా అల వైకుంఠపురంలో వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో పాటు, గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలు త్రివిక్రమ్ బన్నీకి అందించారు. అందుకే వీరిద్దరితో దిగిన ఫోటో అల్లు అర్జున్ స్పెషల్ గా షేర్ చేశారు.

సంబంధిత సమాచారం :