వైరల్ అవుతోన్న బన్నీ స్టైలిష్‌ లుక్ !

Published on Jul 26, 2021 8:05 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో బన్నీ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పిక్ బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్ ను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నల్లని కళ్లద్దాలు, పొడవాటి జుత్తు, గెడ్డంతో బన్నీ వెరీ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇదే లుక్ గానీ పుష్ప లో కూడా ఉంటే కొత్త రికార్డ్స్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

ఇక గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :