మరో హాట్ హీరోయిన్ని తల్లిగా మారుస్తోన్న త్రివిక్రమ్ !

మరో హాట్ హీరోయిన్ని తల్లిగా మారుస్తోన్న త్రివిక్రమ్ !

Published on Mar 21, 2019 4:54 PM IST

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ రాబోతున్న సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. ఒకప్పటి టాప్ హీరోయిన్స్ ను తన సినిమాల్లో తల్లి లేదా అత్త క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు త్రివిక్రమ్. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కి తల్లిగా ఒప్పటి హాట్ హీరోయిన్ టబును తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే టబుకు ఇంకా త్రివిక్రమ్ కథ చెప్పలేదట. త్వరలోనే త్రివిక్రమ్ ఆమెను కలిసి కథ చెబుతారని తెలుస్తోంది. బన్నీ – త్రివిక్రమ్ సినిమా అంటే టబు ఒప్పుకోకుండా ఉంటుందా. మొత్తానికి తెలుగు ప్రేక్షకులు టబును త్వరలో తల్లిగా చూడబోతున్నారు. టబుకి జోడిగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారు.

కాగా ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో బన్ని- త్రివిక్రమ్ కలిసి చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా తండ్రి కొడుకుల మధ్య కథే. అయితే ఆ కథలో చనిపోయిన ఫాదర్ ఎమోషన్ని పట్టుకొని కొడుకు జర్నీ ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు