బన్నీ కోసం అదిరిపోయే మాస్ సాంగ్ !

Published on Aug 18, 2019 1:01 pm IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తమన్ ఈ సినిమా కోసం ఇప్పటికే ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్ లో ఈ మాస్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. కాగా ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారట. ఇక ఆ మధ్య తమన్ ఇచ్చిన మొదటి ట్యూన్ లో సౌండింగ్ కూడా చాలా కొత్తగా ఉందని.. త్రివిక్రమే ఓ సందర్భంలో అన్నారు. మొత్తానికి ఈ సినిమా ఆల్బమ్ తమన్ కెరీర్ లోనే మరో సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచిపోతుందట.

ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :