నిఖిల్ సరసన బన్నీ హీరోయిన్ ?

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ కి ఇది రీమేక్. ఇది కాకుండా ఈ నెల 19వ తేదీన అయన మరొక కొత్త సినిమాను లాంచ్ చేయనున్నారు. అది కూడా రీమేక్ కావడం విశేషం. తమిళ హిట్ చిత్రం ‘కనితన్’ దీనికి మాతృక.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ చిత్రంలో నిఖిల్ సరసన యంగ్ బ్యూటీ, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలు, సరైనోడు’ వంట సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న క్యాథరిన్ థ్రెస హీరోయిన్ గా నటించే అవకాశాముందని తెలుస్తోంది. అయితే ఈ వార్తను చిత్ర టీమ్ ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.