‘సరైనోడు’ కోసం తనని మార్చుకున్న హీరో..

‘సరైనోడు’ కోసం తనని మార్చుకున్న హీరో..

Published on Feb 25, 2016 2:41 AM IST

sarainodu
ఇప్పటివరకూ అల్లు అర్జున్ స్టైలిష్ హీరో గా, కుటుంబ కథాచిత్రాల్లో నటించినవాడిగా మంచి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు పూర్తి యాక్షన్ హీరోగా ‘సరైనోడు’ సినిమాలో కనిపించబోతున్నాడు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ, బద్రీనాధ్ సినిమాలో యాక్షన్ హీరోగా నటించిన అల్లు అర్జున్ ఇప్పుడు ‘సరైనోడు’ తో తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకునే దిశగా అడుగు వేసినట్లు కనిపిస్తున్నది.

ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో తన కండలను చూపిస్తూ పూర్తిగా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర కోసం సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే బన్నీ బాగా కసరత్తులు చేసాడంట. పాత్ర కోసం తనని పూర్తిగా మార్చుకోవడాన్ని చూసి నటన పట్ల తనకు గల అంకితభావానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు