అసెంబ్లీ ముందు బట్టల్లేకుండా నిల్చున్న బర్నింగ్ స్టార్..!

Published on Jul 3, 2021 8:55 pm IST


హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి విభిన్న చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం ‘క్యాలీఫ్లవర్’.. “శీలో రక్షతి రక్షితః” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంపూ సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది.

పోస్టర్ గురుంచి మాట్లాడుకుంటే ఇందులో సంపూ ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం ‘క్యాలీఫ్లవర్’ని అడ్డుగా పెట్టుకుని ఒంటి నిండా గాయాలతో అసెంబ్లీ ముందు నిల్చుని కనిపిస్తున్నాడు. క్యాలీఫ్లవర్ సాక్షిగా.. శీలో రక్షతి రక్షితః అంటూ క్యాప్షన్ జోడించిన ఈ పోస్టర్ సినిమాపై అభిమానుల్లో ఫుల్ ఎగ్‌జైట్‌మెంట్‌ను పెంచేసింది. అయితే తన డైలాగ్స్, ఓవర్ యాక్టింగ్‌తో ప్రేక్షకులకు పెచ్చెక్కించే సంపూ ఈ సారి ‘క్యాలీఫ్లవర్’తో కూడా మెస్మరైజ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయండోయ్.

సంబంధిత సమాచారం :