టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మజాకా’ మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్ కంటెంట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని హీరో సందీప్ కిషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయని.. అందులో ఒక సీన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఓ డైలాగ్ ఉందని.. అది ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకునేలా ఉందని ఆయన అన్నారు. కానీ, ఈ చిత్రానికి సెన్సార్ జరిగినప్పుడు ఆ డైలాగ్‌ని తొలగించినట్లు ఆయన తెలిపారు. ఓ సీన్‌లో హీరోయిన్ నడుము చూసిన హీరో, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇలాంటివి ఎప్పుడో చేసేశారు అంటూ కామెంట్ చేస్తాడట.
అయితే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఇలాంటి డైలాగ్ ఉంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతాయని సెన్సార్ బోర్డు ఈ డైలాగ్‌ను తొలగించిందట. మొత్తానికి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు సందీప్ కిషన్ అండ్ టీమ్ చాలా గట్టిగానే ప్రయత్నించినట్లుగా అర్థమవుతుంది.