రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించడమే కాకుండా, సెప్టెంబర్ నాటికి తన పోర్షన్ పూర్తి చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి మారేలా ప్లాన్ చేశాడు.
సమయాన్ని ఆదా చేసేందుకు ఏకంగా మూడు వేర్వేరు యూనిట్లు నిరంతరం శ్రమిస్తుండగా, ప్రభాస్ సన్నివేశాలను హను రాఘవపూడి స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇమాన్వి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్, డిసెంబర్ 3న సినిమాను విడుదల చేయాలని డెడ్‌లైన్ విధించింది.
మేకర్స్ ఇప్పటికే ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడంతో, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ఏమాత్రం విరామం లేకుండా డే అండ్ నైట్ పనిచేస్తోంది.


