తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్-2’ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో జరిగిన ప్రత్యేక షెడ్యూల్‌లో హృతిక్ తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కేవలం అతిథి పాత్ర మాత్రమే కాదని, కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్, మాస్ ఎలివేషన్ రోల్ అని సినీ సర్కిల్స్ టాక్. లీక్స్ రాకుండా సెట్స్‌లో నో-ఫోన్ రూల్స్ పాటించారట. 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ సినిమాలో రజనీకాంత్‌తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హృతిక్, దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. షూటింగ్ ప్రారంభానికి ముందు హృతిక్.. రజనీ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడని తమిళ వర్గాలు చెబుతున్నాయి.
మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ క్యామియోలు ఏ రేంజ్‌లో పేలాయో.. పార్ట్ 2లో హృతిక్ రోషన్ పాత్ర అంతకుమించి ఉంటుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.


