మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’(Peddi) ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు తప్పక ఫాలో అవుతున్నారు.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండనుందని.. దీని కోసం ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఉర్రూతలూగించే ట్యూన్స్ కంపోజ్ చేశారని తెలుస్తోంది. అయితే, ఈ పాటలో చరణ్‌తో పాటు చిందులేసేందుకు అందాల భామ మృణాల్ ఠాకూర్ ఓకే చెప్పినట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
‘సీతా రామం’ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. అలాంటిది మృణాల్ చరణ్ పక్కన డ్యాన్స్ చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మరి నిజంగానే మృణాల్ ‘పెద్ది’తో సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


