కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే ‘కరుప్పు’ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం, అజిత్ రేసింగ్‌పై ఫోకస్ పెట్టడంతో.. కోలీవుడ్ మేకర్స్‌కు ఇప్పుడు సూర్యనే ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు. ఈ క్రమంలోనే సూర్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించనున్నట్లు, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. నిర్మాత నాగవంశీ ఇప్పటికే నెల్సన్‌కు భారీ అడ్వాన్స్ ఇచ్చారు. నిజానికి నెల్సన్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది, కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’, త్రివిక్రమ్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్‌లో సూర్య ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
మరోవైపు నెల్సన్ ప్రస్తుతం ‘జైలర్ 2’తో పాటు రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పనుల్లో ఉన్నాడు. సూర్య కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్ట్‌లో రిలీజ్‌కు రెడీగా ఉంది. దీని తర్వాత జితు మాధవన్, టి.జె.జ్ఞానవేల్ చిత్రాలను పూర్తి చేసి, ఆపై నెల్సన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే సూర్య ల్యాండ్ మార్క్ మూవీని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తారా..? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


