నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి చిత్రం ఎవరితో ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ క్రమంలో సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తెరంగేట్రం ‘బింబిసార’ ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ గ్రాండ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ షూటింగ్ 2026 డిసెంబర్‌లో ప్రారంభం కానుందని టాక్.
ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ అండ్ బిగ్ కామియో రోల్ కూడా ఉండబోతోందనే వార్త ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. మోక్షజ్ఞ ఎంట్రీకి గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


