ఈ ఏడాది నందమూరి వారసుడి ఎంట్రీ ఉంటుందా లేదా..?

ఈ ఏడాది నందమూరి వారసుడి ఎంట్రీ ఉంటుందా లేదా..?

Published on Jun 26, 2026 2:00 AM IST

Mokshagna

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో ప్రశాంత్ వర్మతో అనుకున్న ప్రాజెక్ట్ ముహూర్తానికి ముందే ఆగిపోగా, గత ఎనిమిది నెలలుగా ఆయన డెబ్యూపై ఎలాంటి కొత్త వార్తలు లేవు.

బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’లో మోక్షజ్ఞకు కీలక పాత్ర ఉంటుందని చెప్పినప్పటికీ.. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కేలా కనిపించడం లేదు.

మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి పలువురు బడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నా, ఆయన మాత్రం ఇప్పటివరకు ఏ సినిమా సైన్ చేయలేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ఏడాది ఆయన ఎంట్రీపై ఎలాంటి బిగ్ అప్‌డేట్ వచ్చేలా లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు