ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్.. ర్యాంపేజ్ ఎంతసేపు అంటే..?

ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్.. ర్యాంపేజ్ ఎంతసేపు అంటే..?

Published on May 13, 2026 7:00 AM IST

NTR Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కాగా ఈ గ్లింప్స్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.

ఈ గ్లింప్స్ సుమారు 180 సెకన్ల నిడివితో వస్తుందని.. ఇది ప్యూర్ ర్యాంపేజ్‌లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ మరియు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. అంతేగాక, జూన్ 4న విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రదర్శించబడే అన్ని థియేటర్లలో ‘డ్రాగన్’ గ్లింప్స్‌ను కూడా స్క్రీనింగ్ చేయనుండటం విశేషం. ఇది మెగా-నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు