మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం జోర్డాన్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మాత రవి యలమంచిలి గతంలోనే ‘డ్రాగన్’ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, ఫైనల్ టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదని హింట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఇది ఒక సంచలన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే 2015లో రామ్ చరణ్ హీరోగా ‘బ్రూస్ లీ : ది ఫైటర్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దశాబ్దం తర్వాత అదే టైటిల్‌ను ఎన్టీఆర్ – నీల్ ప్రాజెక్ట్ కోసం వాడుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం జోర్డాన్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం
