మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పాన్-ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటి సాలిడ్ రన్‌ను కొనసాగిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ఇటీవల విడుదల కావడంతో, దీని ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం పెద్ది చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జూలై 2, 2026 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు గట్టిగా టాక్ నడుస్తోంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుందని, దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.


