రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ బడ్జెట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. ఏకంగా అంతా..?

రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ బడ్జెట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. ఏకంగా అంతా..?

Published on Jun 24, 2026 4:02 PM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా RAPO23 రూపుదిద్దుకుంటోంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాను రామ్ కెరీర్‌లో ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్కేల్‌లో, అత్యున్నత నిర్మాణ విలువల‌తో తెరకెక్కిస్తుండటం విశేషం.

అయితే, ఈ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం టాలీవుడ్‌లోని స్టార్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు విజువల్స్ అందిస్తున్నారు. అలాగే టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిన పీటర్ హెయిన్ ఈ సినిమా కోసం హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తుండగా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ హైదరాబాద్ శివార్లలో భారీ సెట్లను నిర్మిస్తున్నారు.

కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్, టాప్ టెక్నీషియన్స్ కలయికలో వస్తున్న RAPO23 రామ్ పోతినేని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

తాజా వార్తలు