హాట్ బ్యూటీ డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో..?

హాట్ బ్యూటీ డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో..?

Published on Jan 17, 2026 4:14 PM IST

Rukmini

అందాల భామ రుక్మిణి వసంత్ దక్షిణాది సినీ పరిశ్రమలో తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటి. ‘సప్త సాగరాలు’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె ఆ తర్వాత ‘కాంతార’ చిత్రంలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె పేరుతో సోషల్ మీడియాలో డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వినిపిస్తున్న కథనాల ప్రకారం రుక్మిణి తన బెస్ట్ ఫ్రెండ్ సిద్ధాంత్‌తో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. సిద్ధాంత్ ఒక ఫోటోగ్రాఫర్ కాగా, వీరిద్దరూ కలిసి ఉన్న పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు రుక్మిణి ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అలాగే తనగా చెబుతున్న బాయ్‌ఫ్రెండ్‌తో ఆమె బహిరంగంగా కనిపించిన సందర్భాలు కూడా లేవు.

ఇటీవల సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనేక అనధికారిక వార్తలు ప్రచారంలో ఉండగా, కొన్ని నిజమవుతున్నాయి, మరికొన్ని వదంతులుగానే మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం రుక్మిణి వసంత్ డేటింగ్ రూమర్లపై స్పష్టత లేదు. మరోవైపు వర్క్ ఫ్రంట్‌లో ఆమె ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’తో పాటు యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు