‘పార్వేట’ అంటూ సాలిడ్ టైటిల్ పట్టేసిన సాయి ధరమ్ తేజ్..!

‘పార్వేట’ అంటూ సాలిడ్ టైటిల్ పట్టేసిన సాయి ధరమ్ తేజ్..!

Published on Jun 7, 2026 1:58 AM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తుండగా పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను ఓకే చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ‘సేవ్ ది టైగర్స్’ బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ఫేమ్ తేజ కకొమాను సాయి ధరమ్ తేజ్‌ను ఓ ఇంట్రెస్టింగ్ ప్లాట్‌తో మెప్పించాడట. ఈ సినిమాకు ‘పార్వేట’ అనే ఆసక్తికర టైటిల్‌ను కూడా లాక్ చేశారట. ఈ సినిమాను ఓకే చేసిన సాయి ధరమ్ తేజ్, త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాడట

ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాతో పాటు దర్శకద్వయం సుజిత్-సందీప్ చెప్పిన కథకు కూడా సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు