గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో విజయ్ మరియు స్టార్ హీరోయిన్ త్రిషల రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరందుకుంది. దీనికి బలమైన కారణం జూన్ 22న జరిగిన విజయ్ పుట్టినరోజు వేడుకలే. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ప్రతి సంవత్సరం విజయ్ పుట్టినరోజున త్రిష అందరికంటే ప్రత్యేకంగా స్పందించేది. ఆయనతో కలిసి దిగిన అరుదైన, పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ చెప్పడం ఆమెకు ఒక అలవాటుగా వస్తోంది. కానీ, ఈ ఏడాది విజయ్ బర్త్‌డే రోజున త్రిష నుంచి ఎలాంటి పోస్ట్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రెండ్ అవుతున్న ఈ బర్త్‌డే వేడుకల వేళ ఆమె పూర్తిగా మౌనం వహించడంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానాలు బలపడ్డాయి.
అంతేగాక, కేవలం శుభాకాంక్షలు చెప్పకపోవడమే కాకుండా, త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ను అన్‌ఫాలో చేయడం నెట్టింట సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ వీరి రిలేషన్‌పై వచ్చిన వార్తలను లైట్ తీసుకున్న నెటిజన్లు, ఇప్పుడు ఈ అన్‌ఫాలో వ్యవహారంతో వీరిద్దరూ విడిపోయారనే ప్రచారానికి ఇది పక్కా నిదర్శనమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


