విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. దీంతో పాటు రవి కిరణ్ కోలా, శౌర్యువ్ దర్శకత్వంలో కూడా విజయ్ సినిమాలు లైన్లో ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయనున్నాడట. నిజానికి విక్రమ్ కుమార్ మొదట హీరో నితిన్‌తో ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. విక్రమ్ కుమార్ గత కొంతకాలంగా ఒక స్పోర్ట్స్ బేస్డ్ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘స్త్రీ 2’, ‘ముంజ్యా’, ‘ఛావా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ బ్యానర్ నిర్మించబోయే ఈ సినిమా ఎప్పుడు అఫీషియల్‌గా పట్టాలెక్కుతుందో చూడాలి.


