అక్కినేని నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మరియు టాప్ టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్ర రన్‌టైమ్ ఏకంగా 3 గంటలకు పైగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఇంత లాంగ్ రన్‌టైమ్ ఉండదు కాబట్టి ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయితే ఈ నిడివిపై పూర్తి స్పష్టత రానుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎస్‌విసిసి మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


