‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
శ్రీవిష్ణు మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో చెలరేగిపోయాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పేరుకు తగ్గట్టే ఆద్యంతం హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసేలా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్‌కు తోడుగా వెన్నెల కిషోర్, సత్య, సీనియర్ నరేష్, మురళీ శర్మ, అభిరామి, రఘు బాబు మరియు బుల్లి రాజు తమ నటనతో నవ్వుల విందు అందించనున్నారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం టీజర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


