ఈఎన్ఈ రిపీట్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌కు టైమ్ ఫిక్స్..!

ఈఎన్ఈ రిపీట్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌కు టైమ్ ఫిక్స్..!

Published on Nov 23, 2026 11:02 PM IST

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో చిత్రబృందం సంబరాలకు సిద్ధమైంది. మంగళవారం తమ గ్యాంగ్‌కు అధికారికంగా ‘సెలబ్రేషన్ డే’ అని ప్రకటిస్తూ, బాక్సాఫీస్ వద్ద దక్కిన ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లా వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో, చిత్రబృందం అంతా కలిసి ఈ సక్సెస్ పార్టీలో సందడి చేయనుంది.

తాజా వార్తలు